ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు

హొసూరు : హొసూరు సమీపంలోని తొరపల్లిలో 110 ఏళ్ల వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శుక్రవారం కృష్ణగిరి జిల్లాలో తొలి విడత

పోలింగ్‌ జరిగింది. ఇందులో భాగంగా హొసూరు యూనియన్‌లోని తొరపల్లిలో  స్థానికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వతంత్ర భారత తొలి, చివరి గవర్నర జనరల్‌ రాజాజీ స్వస్థలం తొరపల్లి. రాజాజీ ఇంటి పక్కనే ఉన్న ఎల్లమ్మ అనే 110 ఏళ్ల వృద్ధురాలు నడుచుకుంటూ వచ్చి తెలుగు పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంది. పోలింగ్‌ కేంద్రానికి ఆమె నడుచుకు రావడం చూసి గ్రామస్థులతో పాటు పోలింగ్‌ అధికారులూ ఆశ్చర్యపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos