లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలో గురువారం ఓ డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. లక్నోలో కిసాన్‌పాత్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతుంది. ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిపున్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీహార్‌లోని బెగుసరారు నుండి ఢిల్లీకి వెళుతున్న ఓ ప్రైవేటు స్లీపర్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ బస్సులో 60 నుచి 70 మంది ప్రయాణీకులున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం వల్ల ఐదురుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలతోపాటు, ఓ ప్రయాణీకుడు మృతి చెందారు’ అని ఆయన అన్నారు.