హొసూరులో ఘోర అగ్ని ప్రమాదం

హొసూరులో ఘోర అగ్ని ప్రమాదం

హొసూరు : పట్టణంలోని అలసనాథం రోడ్డులో పరిశ్రమలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగిన దుర్ఘటనలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్ సిలిండర్ల గిడ్డంగి నుంచి 420 కిలోల సిలిండరును టెంపోలో ఎక్కించి తరలిస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ మంటలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తాకడంతో వాటిల్లోని వస్తువులకు నిప్పు అంటుకుని

భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు పదికి పైగా దుకాణాలు, రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఆటో, ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన సమయంలో రోడ్డు పక్కన నడిచి వెళుతున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్‌ సిబ్బంది నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటన హొసూరు ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్‌ను టెంపోలో తరలిస్తున్న డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos