ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై చర్యలకు ఆదేశించిన హైకోర్టు

ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై చర్యలకు ఆదేశించిన హైకోర్టు

అమరావతి: కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ కు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానం శనివారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలనే ఆదేశాన్ని అమలు చేసినా, గత వాయిదాకు ఆలస్యంగా హాజరైనందుకు కోర్టుకు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహించింది. వారెంట్ ఉపసంహరణకు సత్యనారాయణ చేసిన వినతిని కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రూ.50 వేలు జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. శిక్షను రద్దు చేయాలని సత్యనారాయణ కోరారు.

తాజా సమాచారం