యథేచ్ఛగా ఫిల్టర్‌ ఇసుక తయారీ

హొసూరు : నిర్మాణాలకు ఏమాత్రం ఆమోద యోగ్యం కాని ఫిల్టర్‌ ఇసుక తయారీ హొసూరు ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతోంది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిల్టర్‌ ఇసుక  తయారీదార్లపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు సంబంధిత అధికారులకు మొర పెట్టుకుంటున్నా స్పందన శూన్యం. సూలగిరి సమీపంలోని త్రాడి, బెప్పాలపల్లి ప్రాంతాలలో ఫిల్టర్‌ ఇసుకను తయారు చేసి బెంగళూరు, కోలారు, మైసూరు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇలాంటి ఇసుకను ఉత్పత్తి చేస్తున్న వారికి అధికారుల అండదండలున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos