థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తి

థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తి

అమరావతి: తొమ్మిది జిల్లాల్లో సీజ్ చేసిన 83 థియేటర్లు తిరిగి తెరుచు కునేందుకు అనుమ తించినట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఆయా థియేటర్ల యజమానులు జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజ మానులు నెల రోజుల్లో సరిదిద్దుకుని ప్రేక్షకులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అంతకు ముందు నిబంధనలు ఉల్లంఘించిన సినిమా థియేటర్ల మూసివేత, ఇతర అంశాలపై చర్చించేందుకు గురువారం నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు పేర్ని నానిని కలిసి చర్చించారు. ఆ తర్వాత ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos