ముప్పాళ్ల : గడ్డి మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చాగంటిపాలెం గ్రామంలో జరిగింది. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు ఆళ్ళ ఆదినారాయణ (45) ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మిర్చి, పసుపు పంటలను సాగుచేస్తున్నాడు. సుమారు 10 లక్షల రూపాయల వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టి పొలం సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో పంటలలో ఆశించిన దిగుబడి రాకపోగా ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో అప్పులు పెట్టి పంట సాగుచేయడం నష్టాలు రావడంతో ఏమి చేయాలో పాలుపోక సోమవారం ఇంటి వద్దే గడ్డి మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన నర్సారావుపేట ప్రైవేటు వైద్యశాలకు తీసుకుపోగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.