రైతుల సమస్యలను పరిష్కరించండి

రైతుల సమస్యలను పరిష్కరించండి

చిత్తూరు : 5 వేల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా … రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కొత్తూరు బాబు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయుడులు మాట్లాడుతూ … చిత్తూరు జిల్లాలో ప్రధానమైన పంటలు మామిడి , టమోటా , చెరుకు , పాలు కు ధరలు పెంచాలని కోరారు. అలాగే జిల్లాలో ఏనుగుల బెడద అధికంగా ఉందన్నారు. జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీ లను, కోపరేటివ్ ఫ్యాక్టరీలను సత్వరమే పున: ప్రారంభించాలన్నా.. మామిడి గుజ్జు పరిశ్రమలను కూడా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యను పరిష్కరించి రైతుల అభివఅద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు నడింపల్లి యువరాజు , జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి , నక్క రామచంద్రయ్య. కిసాన్ మోర్చ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos