ఒక్కప్పటి స్టార్ హీరో ప్రస్తుతం చికిత్సకు డబ్బులు లేక ఆసుపత్రిలో..

  • In Film
  • October 15, 2020
  • 29 Views
ఒక్కప్పటి స్టార్ హీరో ప్రస్తుతం చికిత్సకు డబ్బులు లేక ఆసుపత్రిలో..

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అవకాశాలు వచ్చినంత కాలం వైభవంగా బ్రతికి చివరి దశలో తినడానికి తిండి కూడా లేక అల్లాడిన ఎందరినో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు ఫరాజ్‌ఖాన్‌ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు.90ల్లోనే తన సినిమాలతో స్టార్డమ్అందుకున్నాడు. బ్లాక్ బస్టర్స్ కొట్టి రూ.కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత మెల్ల మెల్లగా పరాజయాలు మొదలై.. ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యాడు. ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనీసం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బుల్లేక అవస్థలు పడుతున్నాడు. 90లలో బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఫరాజ్ ఖాన్ బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ లో ఆరోగ్య సమస్యలతో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. చివరికి ట్రీట్మెంట్ కు కూడా డబ్బుల్లేక ఆయన కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఫరేబ్ (96)మెహందీ(98) పృథ్వీ(97) దిల్ నే పిర్ యాద్ కియా (2001) వంటి సూపర్ హిట్లతో ఫరాజ్ ఖాన్ ట్రెండ్ సెట్ చేసి పెద్ద హీరో గా అవతరించాడు. ఫరాజ్ ఖాన్ అలనాటి నటుడు యూసుఫ్ ఖాన్ కుమారుడు. ఫరాజ్ వరుస ఆఫర్లతో అప్పట్లో బాగానే సంపాదించాడు. అయితే 2000లలో ఆయనకు కలసి రాలేదు. అన్నీ పరాజయాలే పలకరించాయి. ఆ తర్వాత క్రమేణా ఆఫర్లు తగ్గిపోవడంతో ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు.కొద్ది రోజులుగా దగ్గు జ్వరంతో బాధపడుతున్న ఫరాజ్ ఖాన్ కు శ్వాసకు సంబంధించిన సమస్య తలెత్తడంతో బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కాగా ఆయన చెస్ట్ లో ఇన్ఫెక్షన్ సోకడంతో ట్రీట్మెంట్ చేయడానికి రూ. 25 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆయన చికిత్సకోసం ఆస్పత్రిలో ఉన్నదంతా ఖర్చుపెట్టిన కుటుంబీకులు.. ఇప్పుడు అంత సొమ్ము చెల్లించలేక ఇబ్బందుల్లో పడిపోయారు. దీంతో వారు సాయం కోసం ఫండ్ రైజింగ్ ఫ్లాట్ ఫామ్ ను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న నటి పూజాభట్ ఫరాజ్ కుటుంబీకులకు తన వంతు సహాయం అందించారు. ఫరాజ్ పరిస్థితిని వివరిస్తూ ఆర్థిక సహాయం చేయాలని ఆమె ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు నటీనటులు తమ స్పందన తెలియజేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos