ఎగ్జిట్ పోల్స్ మాటా అదే…

ఎగ్జిట్ పోల్స్ మాటా అదే…

ఢిల్లీ : మహారాష్ట్ర, హరియాణాల్లో సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసింది. అనంతరం పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. ఆయా సర్వేలన్నింటిలోనూ రెండు రాష్ట్రాల్లో మళ్లీ భాజపా ప్రభుత్వాలు ఖాయమని తేల్చాయి. మహారాష్ట్రలో భాజపా – శివసేన కూటమిగా ఎన్నికల బరిలో నిలవగా, కాంగ్రెస్ – ఎన్సీపీ కలిసి పోటీచేశాయి. రాష్ట్రంలో మొత్తం 288 స్థానాలు ఉండగా అధికారంలోకి రావాలంటే 145 సీట్లు రావాల్సి ఉంది. అలాగే, హరియాణాలోనూ కమలమే వికసిస్తుందని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మొత్తం 90 స్థానాలు అధికారంలోకి రావాలంటే 46 స్థానాలు గెలుచుకోవాలి.

తాజా సమాచారం