పిల్లాడిని చూసుకోమంటే తండ్రిని చేసింది..

పిల్లాడిని చూసుకోమంటే తండ్రిని చేసింది..

ఉద్యోగాలతో తీరిక లేకపోవడంతో పిల్లాడి బాధ్యతలు చూసుకోవాలని ఆయాను నియమించడమే తల్లితండ్రులు చేసిన నేరమైంది.పిల్లాడిని చూసుకోవాలని చెబితే ఆయా ఆ పిల్లాడిని ఏకంగా తండ్రిని చేసింది.దీంతో తల్లితండ్రులు ఏం చేయాలో పాలుపోక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ ఘటన అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వెలుగు చూసింది.ఫ్లోరిడాకు చెందిన దంపతులు ఉద్యోగాలతో తీరిక లేకుండా గడుపుతుండడంతో 11 ఏళ్ల కొడుకు ఆలనాపాలన చూసుకోవడానికి తెలిసిన వ్యక్తుల ద్వారా 2014లో మరిస్సా మోరీ అనే యువతిని ఆయాగా నియమించారు.అయితే పనిలో చేరినప్పుడు సాధారణంగానే ఉన్న మోరీకు కొద్ది నెలలకు ఓ పిల్లాడు పుట్టాడు.ఈ విషయాన్ని మొదట దంపతులు తేలిగ్గానే తీసుకున్నా మోరీకి పుట్టిన పిల్లాడితో తమ కొడుకు ప్రవర్తిస్తుండడంపై అనుమానం కలిగి ఇద్దరిని గట్టిగా నిలదీయగా అసలు విషయం వెలుగు చూసింది.దీంతో పిల్లాడి తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించగా బాలుడే బలవంతం చేశాడంటూ మోరీ అడ్డం తిరిగింది.అయితే మోరీ ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు మోరీదే తప్పుగా నిర్ధారించి 11 బాలుడిని లైంగికంగా రెచ్చగొట్టి తండ్రిని చేసినందుకు మోరీకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

తాజా సమాచారం