కొడియాలం ఎత్తిపోతల పథకాన్ని సాధిస్తా : కేపీ. మునిస్వామి

కొడియాలం ఎత్తిపోతల పథకాన్ని సాధిస్తా : కేపీ. మునిస్వామి

హొసూరు : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామితో చర్చించి కొడియాలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి కేపీ. మునిస్వామి హొసూరు ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. కృష్ణగిరి జిల్లా హార్టికల్చర్ ఫెడరేషన్ అధ్యక్షుడు,  ఏడీఎంకే పార్టీ జిల్లా కౌన్సిలర్ వెంకటాచలపతి అధ్యక్షతన హొసూరు ప్రాంత రైతులు కావేరి పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హొసూరు ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి  నెలకొని ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన కొడియాలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని  ఆయనను కోరారు. కొడియాలం ఎత్తిపోతల పథకం ద్వారా  హొసూరు ప్రాంతంలోని  చెరువులను నింపితే, రైతుల కష్టాలు తీరుతాయని వివరించారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, వేల కోట్ల రూపాయలు ఖర్చయినా వెనుకంజ వేయకుండా కొడియాలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిపై ఒత్తిడి తీసుకు వస్తానని భరోసా ఇచ్చారు. ఆ పథకాన్ని చేపట్టి, పూర్తి చేయించడం ద్వారా హొసూరు ప్రాంత రైతుల చిరకాల స్వప్నాన్ని సాక్షాత్కారం చేయిస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి హామీపై రైతులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos