తమిళనాడులో జలాశయాల రక్షణ యడపాడి చలువే

తమిళనాడులో జలాశయాల రక్షణ యడపాడి చలువే

హోసూరు : తమిళనాడు రాష్ట్రంలో జలాశయాలలో పూడిక తీయించి భూగర్భ జలాల రక్షణకు కృషి చేసింది ముఖ్యమంత్రి యడపాడి పళని స్వామి మాత్రమే నని మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి అన్నారు. రూ.30 కోట్ల ఖర్చుతో హోసూరు రామనాయకన చెరువును అందంగా తీర్చిదిద్దే పనులను నిర్వహిస్తున్నారు. ఈ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అందులో భాగంగా బాలకృష్ణారెడ్డి రామనాయకుని చేరును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోసూరు కెలవరపల్లి డ్యాం నుండి పైపులైన్ ద్వారా చెరువుకు రోజుకు 30 లక్షల లీటర్ల నీటని నింపనున్నట్లు ఆయన తెలిపారు. చెరువులో డ్యాం నీరు నిండితే సుమారు 3 కి.మీ. దూరం భూగర్భ జల మట్టం పెరిగే అవకాశముందని బాలకృష్ణారెడ్డి అన్నారు. హోసూరు కొడియాలం చెక్ డ్యాం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా 49 చెరువులకు నీరు నింపేందుకు ప్రజా పనుల శాఖ అధికారులు అంచనాలు రూపొందించి, సీఎంకు పంపించారని, త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని బాలకృష్ణారెడ్డి
తెలిపారు. ప్రజా పనుల శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నందున, ఆయన తమిళనాడులో జలాశయాల ను కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.తమిళనాడు రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి కామరాజ్ తరువాత జలాశయా ల రక్షణకు ముఖ్యమంత్రి యడపాడి పళని స్వామి కృషి చేసి చరిత్ర సృష్టించాడని బాలకృష్ణారెడ్డి కొనియాడారు. అదే విధంగా హోసూరు ప్రాంతంలో తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపడతామని ఆయన అన్నారు. కొడియాలం చెక్ డ్యాం నుండి 49 చెరువులకు నీరు నింపితే హోసూరు ప్రాంతం స్యస్యశ్యామలంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos