హొసూరు వైపు గజ గమనం

హొసూరు : ఇక్కడికి సమీపంలోని సానమావు అటవీ ప్రాంతానికి 25 ఏనుగులతో కూడిన  మంద రావడంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . గత వారం రోజులుగా డెంకణీకోట ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు శనివారం వేకువ జామున సానమావు అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎనిమిది వేల ఎకరాలలో వరి పంట కోతకు వచ్చిన సమయంలో  ఏనుగుల మంద రావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఏనుగులు పంటను నాశనం చేస్తాయని, వెంటనే వాటిని తరిమి వేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో రాగి పంట కూడా కోత దశకు చేరుకుంది.  మరో 50 ఏనుగులు డెంకణీకోట అటవీ ప్రాంతంలో ఉన్నాయని, అవి కూడా ఇక్కడికి చేరుకుంటే పంటలను పూర్తిగా నాశనం చేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos