ఏనుగుల దాడిలో రాగి కుప్పలు ధ్వంసం

హొసూరు : ఇక్కడికి సమీపంలోని డెంకణీకోట ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను వెంటనే తరిమేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డెంకణీకోట అటవీ ప్రాంతంలో సుమారు వందకు పైగా ఏనుగులు మకాం వేసి సమీపంలోని పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో రాగి పంట బాగా పండింది. రైతులు పంటను కోసి పొలాల్లోనే కుప్పలు వేశారు. పగటిపూట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు రాత్రి పూట పొలాలపై పడి రాగి కుప్పలను తిని నాశనం చేస్తున్నాయి. బుధవారం రాత్రి

సాపరాన పల్లి వద్దకు వచ్చిన ఏనుగులు రాగి కుప్పలను తిని ధ్వంసం చేశాయి. దీని వల్ల ఆ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏనుగుల బెడదను నివారించడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని, లేనట్లయితే ఆందోళన చేయాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos