కుప్పంలో వణికిస్తున్న గజరాజులు

(రమేష్‌ రెడ్డి)

కుప్పం నియోజకవర్గం లోని శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో గత రెండు రోజులుగా ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి 30 ఏనుగుల గుంపు విడిపోయి ఈ మండలాల్లోకి ప్రవేశించాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల బెడద లేకుండా ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఒక్కసారిగా ఏనుగుల మందలను చూసి హడలెత్తిపోతున్నాయి. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక అటవీశాఖ అధికారులు తరుముతుండటంతో ఎటూపోలేక కుప్పం పరిసర ప్రాంతాల్లో తిష్ట వేశాయి. టపాకాయలు పేల్చినా, ఇతర అలజడులు

సృష్టించినా ఆ ఏనుగులు కదలడం లేదు. రాళ్ళబూదుగురు చెరువులో సేదతీరుతున్నాయి. పగటి పూట చెరువులో తిష్ట వేసి, రాత్రి సమయాల్లో పంట పొలాలపై దాడి చేస్తూ నాశనం చేస్తున్నాయి. గ్రామ శివార్ల దాకా ఏనుగులు వస్తుండటంతో, గ్రామాల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తాయేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos