కమలానికే లక్ష్మి కటాక్షం

కమలానికే లక్ష్మి కటాక్షం

న్యూఢిల్లీ : అధికారంలోని భాజపాకే కార్పొరేట్ విరాళాలు ఎక్కువగా వచ్చాయని ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. 2018-19లో వివిధ కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు వివిధ జాతీయ పార్టీలకు రూ.879.10 కోట్లను విరాళంగా ఇచ్చాయి. అందులో రూ.698.082 కోట్లు ఒక్క కమలం ఖాతాలోనే పడినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. మొత్తం 1,573 సంస్థలు భాజపాకు విరాళాలిచ్చాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దానికి 122 కంపెనీలు రూ.122.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 17 కార్పొరేట్ కంపెనీలు రూ.11.345 కోట్లు విరాళంగా ఇచ్చాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos