పింఛన్ ఇవ్వలేదో పెట్రోలు పోసి తగలెట్టేస్తాం..

పింఛన్ ఇవ్వలేదో పెట్రోలు పోసి తగలెట్టేస్తాం..

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇటువంటి బెదిరింపు ఘటనలు వెలుగు చూడగా తాజాగా అనంతపురం జిల్లా సైతం కొంతమంది వ్యక్తులు అధికారులను బెదిరించారు. జిల్లాలోని కూడేరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కొందరు వ్యక్తులు తమకు ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని మురళీ సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తులు వచ్చే నెల కనుక పింఛన్ రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శివమ్మ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మ కొడవలితో అక్కడికి ఎందుకు వెళ్లిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.మొత్తానికి రైతులు,సాధారణ ప్రజలు ఇలా బెదిరింపులకు దిగుతుండడంతో అధికారుల గుండెళ్లో దడ మొదలైందనే మాట వినిపిస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos