ముంబై: కరోనాతో మరణించిన మృత దేహాల కోసం వాడే సంచులకొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని నగర మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశించింది. 2020 నుంచి 2021 వరకు కిశోరీ పడ్నేకర్ ముంబై మేయర్గా పనిచేశారు. ఆ సమయంలో కరోనా మఅతుల మృతుల కోసం కొన్న సంచుల వ్యవహారంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.రూ.1500గా ఉన్న ఒక్కో సంచిన బీఎంసీ రూ.6700కు కొనుగోలుచేసిందని, ఇందు కిశోరీ పడ్నేకర్తోపాటు బీఎంసీకి చెందిన ఇద్దరు అధికారుల పాత్ర ఉన్నదని ముంబైలోని అగ్రిపద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. తర్వాత దానిని ముంబై పోలీస్ విభాగానికి చెందిన ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ బదిలీ చేశారు. ఇప్పటికే ఈఓడబ్ల్యూ విచారణకు పడ్నేకర్ హాజరయ్యారు కూడా. దీని ఆధారంగా కేసు నమోదుచేసిన ఈడీ మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలు, అధిక ధరకు కొనుగోలు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేసింది.