దేశం పరువు పోయింది

దేశం పరువు పోయింది

న్యూ ఢిల్లీ : అసహన భారత దేశం – ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మోదీతో ముచ్చుకొస్తున్న ముప్పు అనే శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ప్రముఖ ఆర్థిక పత్రిత్ర-ది ఎకనమిస్ట్ శుక్రవారం సంచికలో ప్రధాన వార్త రాయటం భారత్లో అల జడి రేపింది. మోదీ అభిమానులు ట్వీట్లలో ఆ పత్రికను తీవ్రంగా దూషించారు. ‘రామాలయం, సీఏఏ, ఎన్ఆర్సీ తదితర అంశా లపై కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులపై దష్టి సారించాల్సిందిగా వారు వచ్చే ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలని కోరుకుంటు న్నార ’ని పంకజ్ మిశ్రా వ్యాఖ్యానించారు. స్పందించారు. ‘దేశం పెద్దదా ? దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దదా? ఆర్థిక పరిస్థితితి అడ్డం పెట్టుకొని ప్రపంచం ముందు భారత్ పరువు ఎందుకు తీస్తారు? మనం దీన్ని సహించ వద్ద’ని పిలుపు నిచ్చారు. మోదీని, మోదీ ప్రభు త్వాన్ని విదేశీ పత్రికలుగతంలోనూ విమర్శించాయి. ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అంటూ ‘టైమ్’ పత్రిక కథనాన్ని ప్రచురించి నందుకు అప్పుడు ‘బాయ్ కాట్ టైమ్’ అనే ఉప వీర్షికతో భారతీయులు స్పందించారు. ఈ సారి కూడా అలాంటి ట్యాగ్తో స్పందిం చబోయి తప్పులో కాలేశారు. బాయ్కాట్ ది ఎకనమిస్ట్ అనబోయి ‘బాయ్కాట్ ఎకానమి’ హ్యాప్ట్యాగ్తో స్పందించారు. ‘ఎకానమి వేరు ది ఎకనమిస్ట్ వేరనే విషయాన్ని దయచేసి గ్రహించండి, బాయ్కాట్ ఎకానమిని ట్రెండ్ చేయకుండా మోదీకి మంచి ఆర్థిక సలహాలు ఇవ్వండి’ అంటూ మెల్విన్ లూయీ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos