పేడకూ గిరాఖీ పెరిగింది

పేడకూ గిరాఖీ పెరిగింది

రాంచి: పశు సంపదపై ఆధారపడిన గ్రామీణులకు అండగా నిలిచేందుకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం గోధన్ న్యాయ్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద కిలో పేడను రూ. 1.50కి కొంటారు. కొన్న చేసే పేడను వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించనుంది.దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తారు. పేడ కొనుగోలు తేదీ, వివరాలను ఒక పత్రంలో నమోదు చేస్తారు. పర్యవేక్షణకు గ్రామ స్థాయిలో గోధన్ సమితులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాలు, నగరాల్లో పురపాలక సంఘాలు పర్యవేక్షిస్తాయని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos