మరోసారి సూర్య ద్విపాత్రాభినయం

మరోసారి  సూర్య ద్విపాత్రాభినయం

చెన్నై: వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా ‘వాడి వాసల్’ అనే చిత్రం రూపొందనుంది. ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సినిమాకు సంబంధించి హీరోయిన్ తదితర విషయాలు తెలియాల్సి ఉంది. తమిళంలోనే కాకుండా తెలుగు చిత్రసీమలోనూ సూర్యకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో రెండు సినిమాలలో తండ్రీ కొడుకులుగా నటించిన సూర్య త్వరలో మళ్లీ అలాంటి పాత్రల్లోనే ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos