దూబే కాల్చివేతపై విచారణకు డిమాండు

దూబే కాల్చివేతపై విచారణకు డిమాండు

న్యూఢిల్లీ : గూండా వికాస్ దూబే కాల్చివేతపై అత్యున్నత న్యాయ స్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. కాన్పూర్లో ఎనిమిది మంది పోలీసులను గూండా మట్టుబెట్టాడు. ఆ పోలీసుల కుటుంబాలకు న్యాయం జరిగేలా మొత్తం వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణ చేపట్టాలనీ డిమాండ్ చేశారు. సమగ్ర దర్యాప్తుతోనే పోలీసులు, నేరస్తులు, రాజకీయ నేతలు కుమ్మక్కైన తీరు బయటకువచ్చి దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతోనే యూపీ నేరరహిత రాష్ట్రంగా మారుతుందని ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos