ఎదురుకాల్పుల్లో 19 మంది మృతి

ఎదురుకాల్పుల్లో 19 మంది మృతి

మెక్సికో: విల్లా యూనియన్ పట్టణంలో భద్రతా బలగాలు, మాదక ద్రవ్యాల ముఠా మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మొత్తం 19 మంది మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఒక భవ నంలోకి దుండగులు ప్రవేశించినట్లు తెలుసు కున్న భద్రతా దళాలు భవనాన్ని చుట్టు ముట్టాయి. దీంతో మాదక ద్రవ్యాల ముఠా కాల్పుల్ని ప్రారంభించింది.భద్రతా దళాలూ ఎదురు కాల్పులకు దిగటంతో ఆ ప్రాంతం కొన్ని గంటలపాటు కాల్పుల మోతతొ దద్దరిల్లింది. మొత్తం 19 మంది ప్రాణాల్ని కో ల్పో  యా రు. వీరిలో 13 మంది మాదక ద్రవ్యాల ముఠా సభ్యులు, ఇద్దరు పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నట్లు అధికా రులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి 14 లారీలు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం