బెంగళూరులో గంజాయి చాక్లెట్లు

బెంగళూరులో గంజాయి చాక్లెట్లు

బెంగళూరు: నగరంలో పోలీసులు శుక్రవారం ఇక్కడి సుబ్రమణ్యనగర్లోని బీడా దుకాణంపై దాడి చేసి తొలి సారిగా 2.2కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు.దుకాణా దారు కళాశాల విద్యార్థులు, యువతకు గంజాయిని చాక్లెట్ రూపంలో విక్రయిస్తున్నాడని అందిన సమాచారం ప్రకారం పోలీసులు దాడి జరిపారు. దుకాణాదారు పరారయ్యాడు. ఉత్తర్ప్రదేశ్ నుంచి ఈ చాక్లెట్లు నగరానికి దిగుమతి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి అచ్చం పిల్లలు తినే చాక్లెట్లను పోలి ఉన్నాయి. ఒక్కోదాన్ని రూ.50 చొప్పున అమ్ముతున్నట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos