పాక్ కు చైనా డ్రోన్లు

పాక్ కు చైనా డ్రోన్లు

ఇస్లామాబాద్: పాకిస్థాన్కు దాడి చేసే డ్రోన్లును చైనా సరఫరా చేయనుంది. ఒక్కో డ్రోన్లో నేల పై లక్ష్యాన్ని ఛేదించగలిగిన 12 క్షిపణులను అమర్చ వచ్చు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్, గ్వదార్ పోర్టు భద్రత కోసమే వీటిని సరఫరా చేస్తన్నారని తెలిసింది. మొత్తం నాలుగు డ్రోన్లు, రెండు కమాండ్ సెంటర్లతో కూడిన రెండు వ్యవస్థలను పాక్కు అందనుంది. ఇలాంటి వాటిని లిబియాలో వినియోగిఇంచినా ఆశించిన ఫలితాలు రావట్లేదు. గత రెండు నెలల్లోనే ఏకంగా నాలుగు చైనా డ్రోన్లు ప్రత్యర్థుల్ని కూల్చేసాయట. పాక్ భాగస్వామ్యంతో జీజే-2 ఎటాక్ డ్రోన్లను ఉత్పత్తికీ చైనా సిద్ధమవుతోంది. వింగ్ లూంగ్-2 అనే చైనా డ్రోన్కు అదనపు ప్రత్యేకతలను జోడించడం ద్వారా జీజే-2 రూపకల్పన జరిగింది. మొత్తం 48 జీజే-2లను నిర్మించాలని చైనా యోచిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట చైనా వివిధ దేశాలను వాణిజ్య బంధంలో ఏకంగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమ్యునిస్టు దేశం ఇప్పటికే పాక్లో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అనేక రోడ్లు, నౌకాశ్రయాల నిర్మాణం చేపడుతోంది. వీటి రక్షణ కోసం పాకిస్థాన్ను అవసరమైన ఆయుధ సంపత్తిని కూడా సరఫరా చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos