పాపం…వీరి గోడు ఎవరికి వినిపించేను …

పాపం…వీరి గోడు ఎవరికి వినిపించేను …

హొసూరు : పట్టణంలోని సంచార జాతుల వారు తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్‌సీ చర్చి వెనుక భాగంలో 50 కుటుంబాలకు పైగా సంచార జాతుల వారు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. పట్టణంలో, చుట్టుపక్కల గ్రామాలలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని గృహ సముదాయాలకు  పైపుల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వీరికా భాగ్యం లేదు. చర్చి సమీపంలోని కావేరి పైపు ద్వారా బొట్లు బొట్లుగా కారుతున్న నీటి కోసం ఎగబడి బిందెలతో పట్టుకుని తీసుకెళ్తున్నారు.

కార్పొరేషన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు తమకు అందడం లేదని వారు వాపోతున్నారు. గృహ సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన పైపుల ద్వారా నీటిని పట్టుకోవడానికి వెళితే స్థానికులు తరిమివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి  రోజుకు అయిదు బిందెల నీళ్లు వదిలినా తమకు సరిపోతుందని వారు తెలిపారు. అధికారులు కనికరించి తమకు తాగునీటి సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos