బాలీవుడ్ బతుకు దుర్భరం

బాలీవుడ్ బతుకు దుర్భరం

ముంబై : హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తో బాలీవుడ్ నిజ స్వరూపాన్ని ఒక్కొక్కరు నెమ్మదిగా లోకానికి చెబుతున్నారు. పైకి కనిపించేంత అందంగా బాలీవుడ్, అక్కడి వ్యక్తుల మనసులు ఉండవని బహిర్గతం చేసారు. నటి శ్రద్ధాదాస్ కూడా సుశాంత్ బల వన్మరణం పై స్పందించింది. ‘సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వారు బాలీవుడ్ లో నిలబడటం చాలా కష్టం. మధ్య తరగతి నుంచి వచ్చే వాళ్లు ఇండస్ట్రీలో ఎదగ లేరు. ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలనుకుంటే పార్టీలకు, బాంద్రా, జుహూ ప్రాంతాల్లో ఉండే ఖరీదైన క్లబ్ లకు వెళ్లాలి. అక్కడున్న వారితో స్నేహంగా మెలగాలి. మేల్ యాక్టర్లకు కూడా ఇవే ఇబ్బందులు ఉంటాయి. పీఆర్ మేనేజర్లకు డబ్బులు ఇవ్వడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు.డబ్బు తీసుకుని వారు చెప్పేది కూడా ఇదే. వారు కూడా పార్టీలకు వెళ్లమనే సూచిస్తారు. దుస్తులు, షూస్, సెలూన్, స్టయిలిస్ట్, పీఆర్, కార్లు తదితర ఖర్చులను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాళ్లు భరించలేరు. వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది. అసలు ఈ రంగంలోకి ఎందుకొచ్చామా?ని పిస్తుందని తెలిపింది. బాలీవుడ్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వెల్లడించింది. టాలీవుడ్ కూడా ఇందుకు భిన్నంగా ఉండదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos