యాచన సొమ్ము ఎంత? ఏమైంది?

యాచన సొమ్ము  ఎంత? ఏమైంది?

అమరావతి :‘విపక్ష నేత, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆందోళనలు ప్రజల కోసం కాదు. బినామీల కోస మేన’ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఇప్పుడు చంద్రబాబు చే స్తు న్న హడావుడి అంతా అవినీతి ఆస్తులను కాపాడుకోవడం కోసమే. గత ఐదేళ్లలో రైతులకు ఎటువంటి మేలు చేయని చంద్ర బాబు వారికి క్షమాపణలు చెప్పాలి. రైతుల ఉసురు తగిలే గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి చెందారు. భ్రమరావతి ము సు గులో రైతులతో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. బినామీల కోసం ఆరాట పడుతున్న చంద్రబాబును ప్రజలు క్షమించరు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాదిరే చంద్రబాబు వ్యవహరించడమే ఆయన మోసాలకు నిదర్శనం. గతంలో ఈ-ఇటుక పేరుతో చంద్రబాబు చేసిన వసూళ్లకు లెక్కలు లేవు. ఇప్పుడ మరో జోలె పట్టారు. చంద్రబాబును రైతులు నిలదీయాలి. గత ఐదేళ్లలో చంద్ర బాబు రైతుల్ని మోసం చేశారు. 4 వేల 70 ఎకరాలు ఇన్ సైడర్ కు పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది. ఇన్ సైడర్ అక్రమాలు వెలుగుచూసినందునే చంద్రబాబు ఆందోళన చేపట్టారు. ప్రాంతాలు వారీగా వివాదాలు సృష్టించి అల్లక ల్లోలం సృష్టించాలని చూస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించి ముందుకు రావాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చూస్తుంటే మీరు వక్రీకరిస్తున్నార’ని ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos