రక్తదానం చేసిన శునకం..

రక్తదానం చేసిన శునకం..

ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులను రక్షించడానికి మనుషులు రక్తదానం చేయడం సమాజంలో అత్యంత సహజంగా కనిపించే,వినిపించే విషయమే.అయితే ప్రాణాపాయంలో ఉన్న శునకాన్ని రక్షించడానికి మరో శునకం రక్తదానం చేసి కొత్త ట్రెండ్‌ సృష్టించింది.కర్ణాటక రాష్ట్రంలోని సుందర పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మనీషా కులకర్ణి రెండేళ్లుగా రాట్ వైలర్ జాతి కుక్కకురానాఅనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ధార్వాడ్కు చెందిన గణేశ్ కూడా ఇదే జాతి శునకాన్నిరోటీపేరుతో పెంచుకుంటున్నాడు.ఇటీవల కామెర్ల బారిన పడి రోటీ అనారోగ్యం పాలైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానిని కాపాడాలంటే రక్తం అవసరమని వైద్యులు చెప్పడంతో మనీష్ కులకర్ణిని గణేశ్ సంప్రదించి విషయం చెప్పాడు. అతడు అంగీకరించడంతో రానా రక్తదానం చేసింది. దాని రక్తాన్ని రోటీకి ఎక్కించారు. విషయం సోషల్ మీడియాకెక్కడంతోరానాను పలువురు అభినందిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos