ఎన్‌కౌంటర్‌పై ఏపీ మానవ హక్కుల ఫోరం ఆగ్రహం..

ఎన్‌కౌంటర్‌పై ఏపీ మానవ హక్కుల ఫోరం ఆగ్రహం..

దిశ హత్యాచార ఘటన ఎంత ప్రకంపనలు సృష్టించిందో దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌ కూడా అంతేస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.సీన్‌ రికన్‌స్ట్రక్చన్‌లో భాగంగా నిందితులు తమపై దాడి చేసి పారిపోవడానికి యత్నించడంతో కాల్పులు జరిపామని కాల్పుల్లో నిందితులు నలుగురు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.అయితే కస్టడీలో ఉండగా ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని,ఇది అన్యాయమని,దారుణంగా ఎన్‌కౌంటర్‌ చేశారంటూ మానవ హక్కుల పరిరక్షకులు,మేధావులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని మహిళా సంఘాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. నిందితులు తప్పు చేశారని నిర్ధారించాల్సిందీ, వారికి శిక్షలు విధించాల్సిందీ న్యాయస్థానమని ఏపీ మానవ హక్కుల ఫోరం తీవ్రస్థాయిలో స్పందించింది. రిమాండ్ లో ఉన్న ఖైదీలను పోలీసులు ఎలా చంపేస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. దిశ నిందితులను పక్కా ప్రణాళిక ప్రకారమే హతమార్చినట్టు అర్థమవుతోందని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos