నిందితుల ఎన్‌కౌంటర్‌ పై విమర్శలు..

గతనెల 27వ తేదీన మృగాల కంటే దారుణంగా పశువైద్యురాలిపై సామూహిక అత్యాచారం చేసి సజీవదహనం చేసిన నిందితులను కేవలం ఏడు రోజుల్లోనే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు టపాసులు పేల్చి,స్వీట్లు పంచుకొని పోలీసులపై ప్రశంసలు,హర్షధ్వనాలు వ్యక్తం చేశారు.ఇక ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో పోలీసులపై పూలు చల్లి పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేశారు.ఇలా సాధారణ ప్రజల నుంచి సినీ,రాజకీయ,క్రీడా రంగ ప్రముఖులు ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమంది మేధావులు మాత్రం ఎన్‌కౌంటర్‌పై యథావిధిగా తమకు తోచిన విధంగా నిరసనలు,విమర్శలు మొదలుపెట్టారు.న్యాయానికి తూట్లు పొడిచారని,చట్టాలను అపహాస్యం చేశారని ఇలా తమకు మాత్రమే అర్థమయ్యే లాజిక్కులతో పోలీసులపై ఆరోపణలతో బయలుదేరారు.”అత్యాచారం తీవ్రమైన నేరమే. చట్టపరంగానే నిందితులకు కఠిన శిక్ష పడాలి అని తమ వాదన వినిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ వంటి శిక్షలు సమాజానికి చేటు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. తక్షణ న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తుంటారని తెలిసినా కానీ, దానికి ఇది పద్ధతి కాదని కేంద్ర మాజీ మంత్రి పుత్రరత్నం కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు. చట్టాలు మార్చి సత్వర న్యాయం చేకూర్చండి కానీ ఇలా ఎన్ కౌంటర్ లు చెయ్యటం సరైనది కాదని అంటున్నారు.ఇది నిజంగా షాకింగ్ అని మాట్లాడారు. షాకింగ్. మనం ఏమి అయ్యాము? వీరు నిజమైన నేరస్థులు అని ఏ రుజువు ఉంది? వీరిపై అనుమానం మాత్రమే ఉంది, నేరాన్ని రుజువు చేసే దర్యాప్తు మరియు ఆధారాలపై మనకు ఏమైనా నిర్ధారణ ఉందా ? వారికి న్యాయవాది కూడా లేరు, వారి కేసు వాదించిన వారు లేరు.ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డారు ఇప్పుడు మనం సంబరాలు జరుపుకుంటున్నాము సంజుక్త బసు అనే మహిళ మేధావి తెలిపారు. సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ స్పందిస్తూ, “తుపాకి తూటల న్యాయం అవసరం లేదు. ఇది కచ్చితంగా హర్షించతగ్గ పరిణామం కాదు. మహిళలు, అమ్మాయిల రక్షణ పేరు చెప్పి ఇలా ఎన్ కౌంటర్లు చేయడం సమంజసం కాదు. ప్రతి ఎన్ కౌంటర్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విచారణ తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ పై స్వతంత్ర కమిటీ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు.ఇది కచ్చితంగా వ్యవస్థను మరింత కూల్చే ఘటన అన్నారు. అత్యాచారం , హత్య ఘటనలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చెయ్యాలని అక్కడకు తీసుకెళ్ళిన పోలీసులు వారి ఎన్కౌంటర్ తో కొత్త క్రైమ్ సీన్ కన్స్ట్రక్ట్ చేసారని , ఇది మంచి పద్ధతి కాదని రమేశ్‌ శ్రీవాస్తవ్‌ అనే ఇంకో మేధావి శెలవిచ్చారు.దిశపై అత్యంత క్రూరంగా హత్యాచారం చేసినపుడు వీళ్లంతా ఏమయ్యారో వారే సమాధానం చెబితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాంబు దాడులతో సైనికులు,ప్రజలను పొట్టనపెట్టుకునే ఉగ్రవాదులను,కదిలే బస్సులో యువతిని అత్యంత పాశవికంగా హింసించి సామూహిక అత్యాచారం చేసిన నిర్భయ ఘటన నిందితులను ఏళ్ల తరబడి జైళ్లలో మేపడమే వీళ్లు చెప్పే న్యాయమా?సాటి మనుషులపై జాలి,దయ లేని చట్టాలు,న్యాయాలపై గౌరవం,భయం లేని ఇటువంటి రాక్షసులు ఆకృత్యాలకు పాల్పడుతూ వికట్టాహాసం చేస్తుంటే న్యాయం,చట్టం,ధర్మం అంటూ ఏళ్లకు ఏళ్లు మేపమని ఈ మేధావులు చెబుతున్నారా? వీళ్లు చెప్పిన విధానాలనే ప్రభుత్వాలు,పోలీసులు ఇప్పటివరకు పాటించారుగా మరి ఏమైనా మార్పు వచ్చిందా?పైగా తొమ్మిది నెలల పసికందు నుంచి 70 ఏళ్ల వృద్ధురాళ్లను సైతం కామాంధులు వదలడం లేదే?మార్పు రావాల్సింది చట్టాలు,న్యాయాల్లో కాదు మనుషులు ఆలోచన విధానాల్లో అని ఈ మేధావులకే తెలుసు లేదో మరి!

 

 

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos