వర్మ చిత్రం యూనిట్‌కు బాలా నోటీసులు..

  • In Film
  • May 24, 2019
  • 725 Views
వర్మ చిత్రం యూనిట్‌కు బాలా నోటీసులు..

దక్షిణాదిలో దర్శకుడు బాలాకు ఉన్న గుర్తింపు చాలా ప్రత్యేకం ఇతర దర్శకులకు భిన్నంగా సహజత్వానికి చాలా దగ్గరగా చిత్రాలను తెరకెక్కించే బాలా ప్రత్యేకమైన అభిమానులను కలిగిఉన్నాడు.రెండేళ్ల క్రితం తెలుగులో పాత్‌ బ్రేకింగ్‌ మూవీగా కితాబులందుకున్న బ్లాక్‌బస్టర్‌ మూవీ అర్జున్‌రెడ్డి చిత్రాన్ని తమిళంలో విక్రమ్‌ కొడుకు ధృవ హీరోగా బాలా దర్శకత్వంలో వర్మ పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే.అయితే వర్మ సినిమా ఫైనల్‌ ఔట్‌పుట్‌ నచ్చక మొత్తం సినిమాను స్క్య్రాప్‌ చేసి గిరిసాయ దర్శకత్వంలో వర్మ సినిమాను మళ్లీ ఫ్రెష్‌గా చిత్రీకరించారు.చిత్రీకరణ పూర్తి చేసుకున్న వర్మ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో తను తీసిన వెర్షన్ లో ఏవైనా సన్నివేశాలు వాడుకున్నారేమోనని హీరో విక్రమ్ తో పాటు నిర్మాణ సంస్థలకు నోటీసులు పంపించారట.తను తీసిన వెర్షన్ లో సన్నివేశాలను వాడుకుంటే గనుక చట్టరీత్యా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి బాలాని ప్రాజెక్ట్ నుండి తప్పించిన తరువాత  హీరోయిన్ గా మరో అమ్మాయిని తీసుకున్నారు.హీరో ధృవ్ లుక్ లో మార్పులు చేశారు. ఆ ప్రకారంగా చూసుకుంటే సన్నివేశాలు వాడుకునే ఛాన్స్ లేదు. కానీ దేనికైనా మంచిదని ముందే బాలా నోటీసులు ఇచ్చేసినట్లున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos