దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై..!

  • In Sports
  • October 16, 2020
  • 23 Views
దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై..!

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ మారనున్నాడు. దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ పగ్గాలను ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించనున్నాడు. తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసం కార్తీక్ కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ మేరకు కోల్‌కతా మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించాడు. నాయకత్వ బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించాలని కార్తీక్ ఫ్రాంచైజీని కోరాడు. ముంబైతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు, నరైన్‌కు ఓపెనర్‌గా పదే పదే అవకాశాలు ఇవ్వడం.. తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో.. ఫ్యాన్స్ కార్తీక్‌ను కెప్టెన్సీ వదులుకోవాలని డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్‌‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను జట్టులో ఉంచుకొని కార్తీక్‌కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం కార్తీక్‌పైనే నమ్మకం ఉంచింది. కోల్‌కతా విజయాల బాట పట్టాక.. కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos