సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పూజాపై కౌంటరా?

  • In Film
  • May 30, 2020
  • 61 Views
సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పూజాపై కౌంటరా?

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న సమంత,పూజా హెగ్డేల మధ్య శీతల సమరం ముదిరి పాకాన పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.సమంత నటించిన ఓ చిత్రంలోని స్టిల్‌పై పూజా సామాజిక మాధ్యమాల్లో అంత అందంగా లేదంటూ వ్యాఖ్యానించడంతో గొడవ మొదలైంది.పూజాకు వ్యతిరేకంగా సమంత అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌టాగ్‌ ప్రారంభించడం అందుకు చిన్మయి,నందినీరెడ్డి మద్దతు ప్రకటించడంతో పూజా అభిమానులు సైతం ఎదురుదాడి మొదలుపెట్టారు.దీంతో తన ఖాతా హ్యాక్‌ అయిందని పూజా వివరణ ఇచ్చినా సమంత అభిమానులు వెనక్కి తగ్గలేదు.దీనిపై పూజా స్పందించకపోయినా సమంత మాత్రం ఏదోఒక పోస్ట్‌ చేస్తూ వివాదాన్ని మరింత రాజేస్తోంది. ఇప్పుడు సామ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే ప్రెజెంట్ జరుగుతున్న ఇష్యూ మీదే పెట్టినట్లుగా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో రోజు స్టోరీ పెడుతూగుడ్ హార్ట్ కలిగి ఉండటం వలన వచ్చే మరొక సమస్య ఏమిటంటే మీరు స్టుపిడ్ అని వారు భావిస్తుంటారుఅని పెట్టింది. దీంతో ఇది సామ్ పూజా హెగ్డేని ఉద్దేశించే స్టోరీ పెట్టిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో సామ్పూజా ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos