పోలీసుల ముందే హత్య చేసిన ‘కమలనాధుడు’

పోలీసుల ముందే హత్య చేసిన ‘కమలనాధుడు’

లక్నో: అధికారులు, పోలీసుల ముందే ఎమ్మెల్యే అనుచరుడు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన గురు వారం సంభవించింది. బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపుల సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జయప్రకాశ్ (46) అనే వ్యక్తిపై భాజపా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ధీరేంద్ర సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. వేదికపై అధికారులు ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపుల కోసం అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయప్రకాశ్, ధీరేంద్ర సింగ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ధీరేంద్ర తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగ బడ్డాడని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. హత్య జరిగే సమయానికి అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారని స్థానికులు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos