దేవిరెడ్డి శారద ట్రస్ట్ సేవలు అద్భుతం

దేవిరెడ్డి శారద ట్రస్ట్ సేవలు అద్భుతం

నెల్లూరు : దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, తన భార్య శారద పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అద్భుతమని లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నార్త్ మోపూరులోని దేవిరెడ్డి శారద ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హై స్కూల్, ఆసుపత్రి, కళ్యాణ మండపం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ప్రసంగించారు. ‘దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా సేవా కేంద్రాలను నిర్మించారు. ఇది చాలా సంతోషదాయకం. విద్యార్థులకు ఉచిత విద్యా బోధన, ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం తదితర సేవలను అందిస్తున్న విధానం ప్రశంసనీయం. నెల్లూరులో కూడా ఈ విధమైన నిర్మాణాలు లేవు. అల్లూరు మండల ప్రజలకు ఇది సదవకాశం. సుధాకర్ రెడ్డికి అభినందనలు. ఇటువంటివి మరెన్నో చేపట్టాల’ని ఆశించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, స్థానిక నేత అబ్దుల్, పాముల హరి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos