క్రికెట్‌కు డివిలియర్స్‌ గుడ్‌బై

  • In Sports
  • November 19, 2021
  • 87 Views
క్రికెట్‌కు డివిలియర్స్‌ గుడ్‌బై

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పుతున్నట్లు డివిలియర్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఏబీ డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ లాంటి విదేశీ లీగ్‌లో ఆడుతున్నాడు. తనకు వయస్సు పైబడిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీడీ తెలిపాడు. ఐపీఎల్‌లో గత కొన్నాళ్ల నుంచి ఆర్సీబీ తరుపున ఆడుతున్న మిస్టర్ 360.. భారత అభిమానుల్లో ప్రత్యేకమైన స్ధానం సంపాందించుకున్నాడు.
ఈ క్రమంలో ఏబీడీ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. చివరగా ఐపీఎల్-2021లో ఆడిన ఏబి డివిలియర్స్.. 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు డివిలియర్స్ ఆడాడు.
“ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ ఆడినప్పటి నుంచి మెదలు పెడితే, నేను స్వచ్ఛమైన ఆనందంతో, హద్దులేని ఉత్సాహంతో క్రికెట్ ఆడాను. ఇప్పుడు నా వయస్సు 37 ఏళ్లు దాటింది. ఈ వయస్సులో ఇదే సరైన నిర్ణయం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన అభిమానుల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని డివిలియర్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos