పట్టణ పంచాయతీల్లో పడకేసిన అభివృద్ధి

పట్టణ పంచాయతీల్లో  పడకేసిన అభివృద్ధి

ప్రజావాహిని – బెంగళూరు

నూతన పట్టణ పంచాయతీల్లో గత ఆరు మాసాలుగా అభివృద్ది కార్యకాపాలు పడకేసాయని పలువురు సభ్యులు శుక్ర వారం విధాన సభలో ఆక్రోశించారు. ’ మైసూరు జిల్లా హోటగళ్లి గ్రామ పంచాయతీని నగర సభగా, బోగాది, శ్రీరాంపుర కడకోళ, రమ్మనహళ్లి గ్రామ పంచాయతీల్ని పట్టణ పంచాయతీలుగా ఆరు మాసాల కిందట ఉన్నతీకరించారు. అప్పటి నుంచి రహదార్లు, మురుగు నీటి కాల్వలు, వీధి విద్యుత్‌ దీపాల నిర్వహణ, మొదలుకుని అన్నీ స్తంభించి పోయాయి. అవి తమ పరిధిని దాటాయని పంచాయతీరాజ్‌ శాఖ నిధుల్ని విడుదల చేయకుండా నిలిపేసింది.పుర పాలక శాఖ  పట్టించుకోవటం లేద’ని చాముండేశ్వరి  సభ్యుడు జి.టి.దేవేగౌడ ఆక్రోశించారు. పలువురు శాసనసభ్యులు ఆయన తో ఏకీభవించారు. ఉన్నతీకరించిన స్థానిక సంస్థలకు వెంటనే నిధుల్ని విడుదలకు చర్యల్ని   తీసుకుంటామని మంత్రి ఎన్‌.నాగరాజు భరోసా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos