రెచ్చగొట్టిన వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి

రెచ్చగొట్టిన వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి

న్యూ ఢిల్లీ :[ఈశాన్య ఢిల్లీలో హింసా కాండకు ప్రేరేపించేలా వ్యాఖ్యానాలు చేసిన భాజపా నేతలకు వ్యతిరేకంగా ప్రాధమిక సమాచార నివేదికల్ని దాఖలు చేసి విచారణ ప్రారంభించాలని పోలీసుల్ని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. శాంతి భద్రతల పరి రక్షణలో పోలీసుల పని తీరు పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తీకరించింది. భాజపా నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీడియోలను పోలీసులు ఇంకా చూడక పోవ డంపై కూడా మండిపడింది. వెంటనే ఆయా నేతలకు వ్యతిరేకంగా ప్రాథమిక సమాచార నివేదికల్ని దాఖలు చేసేలా సూచనలు ఇవ్వాలని సొలి సిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. హింసాకాండకు బాధ్యులను అరెస్టు చేయాలని దాఖలైన వ్యాజ్యాంపై న్యాయ స్థానం బుధవారం విచారణ జరిపింది. ‘ప్రస్తుతం దిల్లీలో తీవ్రమైన, ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనలకు ముందు భాజపా నేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చూశారా?’ని పోలీసులను ప్రశ్నించింది. అలాంటి వీడియో ఏదీ తాము చూడ లేదని డిప్యూటీ పోలీస్ కమిషనర్ చెప్పగానే ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అయితే ఇప్పుడు చూడండి అంటూ కపిల్ మిశ్రా వీడియోను కోర్టు ప్రదర్శించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos