కమల దళానికి తగిన శాస్తి

కమల దళానికి తగిన శాస్తి

కోల్కత : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ విజయంతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో భాజపా పతనం ఆరంభమైందని మంగళవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల విజేత, మూడో మారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కనున్నకేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు.‘క్రమ క్రమంగా అన్ని రాష్ట్రాల్లో భాజపా బలహీన పడటం ప్రారంభమైంది. త్వరలోనే కాషాయ దళం ప్రభ కోల్పో తుం ది. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బంగ శాసనసభ ఎన్నికల్లో కూడా భాజపా చిత్తుగా ఓడిపోనుంది. ఢిల్లీ విద్యార్థులను, మహిళ లను చిత్ర హింసలకు గురి చేసారు. ఢిల్లీ ప్రజలు కాషాయ దళానికి తగిన శాస్తి చేశార’ని చురకలంటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos