దావూద్ ఇబ్రహిం కరాచీలో

దావూద్ ఇబ్రహిం కరాచీలో

ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. దావూద్ ఇబ్రహింతో ముడిపడివున్న నగదు అక్రమ బదిలీ కేసు దర్యాప్తులో దావూద్ మేనల్లుడు అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పాడని వెల్లడించింది. దావూద్ ఇబ్రహిం సోదరి హసీనా పార్కర్ కొడుకే అలీషా. అయితే దావూ ద్తో తాను సంపర్కంలో లేనని అలీషా చెప్పాడని ఇటివలే ముంబై కోర్టులో సమర్పించిన చార్జిషీటులో పేర్కొంది. దాని ప్రకారం… దావూద్ ఇబ్రహిం భార్య మెహజాబిన్ ఈద్(పండుగ) లాంటి సందర్భాల్లో పార్కర్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పలకరించేవారు. ఇదే కేసులో ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్ నూ విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఛోటా షకీల్ సహాయకుడు సలీం ఖురేషీని కూడా ఈడీ బృందం గతంలో ప్రశ్నించింది. ఖురేషీ ఫోర్జరీ పాస్పోర్టుపై పలుమార్లు పాకిస్తాన్ వెళ్లినట్టు బయటపడింది. దావూద్ ఇబ్రహిం, ఛోటా షకీల్ తరపున అతడు పనిచేశాడని వివరించింది. ఫిబ్రవరి 3, 2022న ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దావూడ్ ఇబ్రహిం, ఇతరు లపై ఈడీ మనీల్యాండరింగ్ చట్టాల కింద దర్యాప్తు మొదలుపెట్టింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. దావూడ్ ఇబ్రహిం, హజీ అన్సీస్ అలియాస్ అనీస్ ఇబ్రహిం షేక్, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, జావీద్ పటేల్ అలియాస్ జావిద్ చిక్నా, ఇబ్రహిం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మీమన్ అలియాస్ టైగర్ మీమన్ నిందితులుగా ఉన్నారు. కా గా భారత్ నుంచి పాకిస్తాన్ పారిపోయిన దావూద్ ఇబ్రహిం భారత్లో హసీనా పార్కర్ అలియాస్ హసీనా, ఇతర సహాయకుల ద్వారా భారత్లో తన కార్యకలాపాలను నిర్వ హిం చేవాడని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos