దవీందర్ సింగ్ పై ఎన్‌ఐఏ కేసు

దవీందర్ సింగ్ పై ఎన్‌ఐఏ కేసు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడనే ఆరోపణపై శ్రీనగర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కు వ్యతిరేకంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం కేసు దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించింది. వచ్చే సోమవారం కశ్మీర్ నుంచి దవీందర్ను దిల్లీకి తీసుకువచ్చి విచారి స్తామని ఎన్ఐఏ అధికార్లు తెలిపారు. ఆయన కారు, నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఏకే-47, గ్రనేడ్లు, పిస్తోల్, చరవాణిల్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించనున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను తన కారులో తీసుకెళుతున్న దవీందర్ సింగ్ను గతవారం జమ్ము-కశ్మీర్ పోలీసులు అరెస్టు చేసారు. దరమిలా ఆయన్ను సస్పెండ్ చేసి కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. ‘పుల్వామా డీఎస్పీగా దవీందర్ ఉన్నప్పుడే అక్కడ దాడి జరిగింది. దీనిపై ఆయనను నోరు మెదపకుండా చేసేందుకే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించార’ని ఆరోపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos