తారక్‌కు అభిమానులకు డేవిడ్‌ భాయ్‌‌ సర్‌ప్రైజ్

తారక్‌కు అభిమానులకు డేవిడ్‌ భాయ్‌‌ సర్‌ప్రైజ్

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని కార్యకలాపాలతో పాటు క్రీడలు సైతం స్తంభించడంతో అన్ని దేశాల క్రికెటర్లు తమకు తోచిన విధంగా లాక్‌డౌన్‌ సమయాన్ని గడుపుతున్నారు.ఇక ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్‌,సర్‌రైజర్స్‌ జట్టు సారథి డేవిడ్‌ వార్నర్‌ కొద్ది రోజులుగా తెలుగు చిత్రాల్లోని డైలాగులు,పాటలకు స్టెప్పులతో తెలుగు ప్రజలను ఆకట్టుకుంటూ మరింత దగ్గరవుతున్నాడు.ఇప్పటికే పోకిరి సినిమాలతో డైలాగుతో పాటు అలవైకుంఠపురం చిత్రంలో పాటలకు కుటుంబంతో సహా స్టెప్పులేసి అలరించాడు.తాజాగా ఓ అభిమాని కోరికపై జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. “డేవిడ్ భాయ్, రేపు నా ఫేవరెట్ హీరో తారక్ పుట్టినరోజు. అతనికి మీరు విషెస్ తెలుపగలరా?” అంటూ అభిమాని ట్విట్టర్ లో కోరగా, వార్నర్ సానుకూలంగా స్పందించాడు. “హ్యాపీ బర్త్ డే బడ్డీఅంటూ ట్వీట్ చేసి అభిమానిని సంతోష సాగరంలో ముంచెత్తాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos