అఫ్రిదిపై మండిపడ్డ పాక్‌ ‌మాజీ క్రికెటర్..

  • In Sports
  • May 26, 2020
  • 177 Views
అఫ్రిదిపై మండిపడ్డ పాక్‌ ‌మాజీ క్రికెటర్..

భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు. భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌ల స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనా? అని అఫ్రిదిని ప్రశ్నించాడు. వారి ద్వారా ఆ దేశ సాయాన్ని కోరి అది అందిన తర్వాత ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నాడు.అఫ్రిది రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే క్రికెట్‌తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని సూచించాడు. అతని వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా పాక్‌ క్రికెట్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని మండిపడ్డాడు.‘ఏదైనా మాట్లాడే ముందు అఫ్రిది ఒకసారి ఆలోచించుకోవాలి. అతనికి రాజకీయాల్లోకి వెళ్లాలనుంటే క్రికెట్‌తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలి. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు.. భారత్‌లోనే కాకుండా యావత్ ప్రపంచానికి పాకిస్థాన్ క్రికెట్‌పై వ్యతిరేకత కలిగేలా చేస్తాయని వ్యాఖ్యానించాడు.’యూవీ, భజ్జీల సాయాన్ని ఆర్జించి వారి దేశం, ప్రధానిపైనే అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని కనేరియా ప్రశ్నించాడు. ‘అతను వారి సాయం కోరాడు. అందుకున్నాడు. ఇప్పుడేమో.. ఆ దేశం, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు ఇదే రకమైన స్నేహం? వారి ఫ్రెండ్షిప్‌కు ఇచ్చిన విలువ ఇదేనా?’అని కనేరియా ప్రశ్నించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos