ఇంకా ఏం కావాలి? నేను చనిపోవాలా?

  • In Sports
  • December 30, 2019
  • 185 Views
ఇంకా ఏం కావాలి? నేను చనిపోవాలా?

పాకిస్థాన్‌ జట్టులో మత,ప్రాంతీయ వివక్ష ఉండేదని హిందువైన కారణంగా డానిష్‌ కనేరియా పాక్‌ జట్టులో మత వివక్ష ఎదుర్కొన్నాడంటూ పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలు పాక్‌ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.అక్తర్‌ చేసిన వ్యాఖ్యలను పాక్‌ మాజీ క్రికెటర్లు మియాందాద్‌,ఇంజిమామ్‌ ఖండించారు. వారు చెప్పిందే నిజమైతే జట్టులో అతడు పదేళ్లు ఎలా ఆడగలిగి ఉండేవాడంటూ మియాందాద్ ఫైరయ్యాడు. డబ్బుల కోసం కనేరియా ఏమైనా చేస్తాడని తీవ్ర విమర్శలు చేశాడు.మియాందాద్ వ్యాఖ్యలపై కనేరియా మండిపడ్డాడు. తానేమీ ఊరికనే పదేళ్లు కొనసాగలేదని, తన రక్తాన్ని చిందించి ఆడానని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. తన వేళ్లు రక్తమోడుతున్నా బౌలింగ్ చేశానని గుర్తు చేశాడు. కొందరైతే దేశాన్ని తాకట్టుపెట్టి ఫిక్సింగ్లకు పాల్పడ్డారని ఆరోపించాడు. అయినా, వారిని జట్టులోకి తీసుకున్నారని, కానీ తానెప్పుడూ డబ్బు కోసం దేశాన్ని తాకట్టు పెట్టలేదని అన్నాడు. తాను చాలా కాలం నుంచి ఉపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘మీకు ఇంకా ఏం కావాలి? నేను చనిపోవాలా?’’ అని కనేరియా ప్రశ్నించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos