మరో వివాదంలో జైరా..

  • In Film
  • May 30, 2020
  • 51 Views
మరో వివాదంలో జైరా..

దంగల్‌ చిత్రంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జైరా వసీమ్‌ అటుపై సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ చిత్రంతో మరింత గుర్తింపు,క్రేజ్‌ తెచ్చుకుంది.ఈ చిత్రం అనంతరం మరే చిత్రంలో నటించని జైరా విమానంలో లైంగిక వేధింపులు ఎదరుయ్యాయని ఒకసారి సినిమాలకు శాశ్వతంగా దూరం కానున్నానంటూ లేఖతో మరోసారి వార్తల్లో నిలిచింది.తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.భారతదేశంలో మిడుత దాడులను సమర్థిస్తున్నట్లు ఖురాన్ నుండి ఒక పద్యం ట్వీట్ చేయడంతో బాలీవుడ్ నటి జైరా వసీమ్ ఇటీవల మరొక వివాదంలో చిక్కుకుంది.దీనిపై విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో జైరా తన ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ ఖాతాలను కూడా తొలగించింది.అయినప్పటికీ నెటిజన్లు మాత్రం జైరా పోస్ట్‌ చేసిన‘దేవుని కోపం’పోస్ట్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు #StandWithZara హ్యాష్‌టాగ్‌తో కొంతమంది మద్దతుగా నిలుస్తుండడంతో వివాదం రాజుకుంటోంది..

జైరా చేసిన ట్వీట్‌..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos