కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు

హైదరాబాదు: కోమటి రెడ్డి సోదరులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాలు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో లబ్ధి పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దారుణం. ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజ గోపాల్ ఇద్దరూ ఒకటే. ఏం మాట్లాడతారో వారికే తెలియదు. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఒకే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వెంకటరెడ్డి తీరును చూస్తుంటే ఆయన కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వెంకటరెడ్డి చండూరు సభకు హాజరు కాకుండా అమిత్ షాను కలిసేందుకు వెళ్లార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos