న్యూటన్ సూత్రాన్ని మర్చిపోతే జరిగేది ఇదే..

న్యూటన్ సూత్రాన్ని మర్చిపోతే జరిగేది ఇదే..

చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని చిన్నప్పుడు పాఠాల్లో చెప్పిన న్యూటన్ సూత్రం ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటుంది.అయితే ఓ ఇద్దరు యువకులు మాత్రం న్యూటన్ సూత్రాన్ని మర్చిపోయినట్టున్నారు అందుకు ఫలితం అనుభవించారు.సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో పోస్టు చేసి న్యూటన్ మూడవ గమన నియమాన్ని ఉదాహరించారు. మీరు ఫిజిక్స్ క్లాసులో నిద్రపోయి న్యూటన్ మూడవ గమన నియమాన్ని వినలేదా… అయితే ఈ వీడియో చూడండి, అచ్చం ఇలాగే జరుగుతుంది అంటూ ట్వీట్ చేశారు.ఇంతకీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే… ఇద్దరు కుర్రాళ్లు బైక్ వెళుతుండగా… వారిలో వెనుక కూర్చున్న ఆకతాయి రోడ్డుపై ఉన్న పశువును కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. కాలితో తన్నే ప్రయత్నంలో బాగా కదలడంతో బండి కుదుపులకు లోనైంది. పశువును తన్నిన కుర్రాడు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోగా, బైక్ నడుపుతున్న కుర్రాడు బైక్ ను స్తంభానికి ఢీకొట్టి తాను కూడా కిందపడిపోయాడు. చర్యకు ప్రతి చర్య ఇలా ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos