మరాఠీ ని తాత్సారం చేస్తే జీతంలో కోత

మరాఠీ ని తాత్సారం చేస్తే జీతంలో కోత

ముంబై: మాతృభాష మరాఠికి పెద్దపీట వేయాలని మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయించుకుంది. అన్ని రకాల అధికారిక కార్య కలా పాల్లో మరాఠి వాడుకను తప్పని సరి చేసి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మరాఠీని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చింది. మరాఠిని వాడటంలో విఫలమైన వారి సేవా దాఖలాలో పని తీరు పట్ల అసంతృప్తి నమోదు చేసి వార్షిక వేతన పెంపును కోత కోస్తా మని హెచ్చరించింది. మరాఠి వాడుకను తప్పనిసరి చేస్తూ గతంలో అనేక ఉత్తర్వుల్ని జారీ చేసినా అంతర్గత సమాచారానికి అంటూ ఆంగ్లా న్నే వాడుతున్నారని ప్రభుత్వం ఆగ్రహించింది. అధికారిక ఉత్తర్వుల్లో మరాఠిని ఉపయోగిస్తే, ప్రభుత్వ పథకాలను ప్రజలు బాగా అర్థం చేసు కుని, ప్రయోజనం పొందుతారని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos